రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కొమురం భీం ప్రాజెక్టులోకి 3,777 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం రెండు గేట్లను 1.0 మీటర్ల మేర ఎత్తి 4,207 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 237 మీటర్లకు చేరుకుంది.