
ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో AIని వాడనున్న కేంద్రం
ప్రభుత్వ టెండర్ల తయారీ, సమీక్ష ప్రక్రియలో AI వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ఈ మేరకు ఒక 'AI-పవర్డ్ ప్లాట్‌ఫారమ్'ను అభివృద్ధి చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. ఈ AI వ్యవస్థ టెండర్ల తయారీ సమయాన్ని 70-80% వరకు తగ్గించడంతో పాటు, అవకతవకలను అరికట్టి పారదర్శకతను పెంచుతుందని అంచనా. ఇది అధికారులకు సహాయకుడిగా పనిచేస్తుంది తప్ప వారి ఉద్యోగాలను భర్తీ చేయదు. ఈ ప్రాజెక్ట్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకునేలా ప్రణాళిక చేస్తున్నారు.




