కుల వివక్ష ఆరోపణలపై డీఎస్పీకి బాధిత మహిళల ఫిర్యాదు

4చూసినవారు
కుల వివక్ష ఆరోపణలపై డీఎస్పీకి బాధిత మహిళల ఫిర్యాదు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖీరిడి పాఠశాలలో 14 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న దళిత మహిళలను కులం పేరుతో దూషించి, విధుల నుంచి తొలగించారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్‌కు ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, పీఈటీ, పొదుపు సంఘం సభ్యులు 'మీరు మాల కులం వారు, మీరు వండిన అన్నం పిల్లలు తినడం లేదు' అని చెప్పి తమను తొలగించారని మహిళలు ఆరోపించారు. తమకు రావాల్సిన వేతనం కూడా ఇవ్వలేదని వారు వాపోయారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాధితులకు అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్