పరండోలి సర్పంచ్ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

2చూసినవారు
కేరమేరి మండలం పరండోలి గ్రామపంచాయతీ సర్పంచ్ రాథోడ్ పుష్పలత తీరుపై పరండోలి, శంకర్‌లోది, కోట గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ స్థానికంగా అందుబాటులో లేకుండా గ్రామపంచాయతీ వ్యవహారాలు నిర్వహిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారిందని, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్