ఓటరు గణన ఫారం తప్పనిసరి.. అజ్మీర శ్యాంనాయక్

1268చూసినవారు
ఓటరు గణన ఫారం తప్పనిసరి.. అజ్మీర శ్యాంనాయక్
సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరు గణన (ఎన్యూమరేషన్) ఫారం తప్పనిసరిగా పూర్తి చేసి బీఎల్ఓకు అందజేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్వయంగా తన ఫారాన్ని నింపి అందజేశారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ప్రతి అర్హుడూ తమ వివరాలను ధృవీకరించి, సరిచేసుకోవాలని, దీనివల్ల ఓటరు జాబితా ఖచ్చితత్వం పెరిగి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్