గంగాపూర్ గ్రామపంచాయతీ 6వ వార్డులో చేతి పంపు నుంచి మురికినీరు వస్తోందని ప్రజల ఫిర్యాదు మేరకు, 6వ వార్డు సభ్యుడు జాగిరి శ్రీనివాస్ చొరవ తీసుకున్నారు. మెకానిక్‌కు సహాయకులు లేకపోవడంతో 7వ వార్డు సభ్యులు వడై లక్ష్మి-బిక్కు, 8వ వార్డు సభ్యుడు దుర్గం వెంకట్రాజేష్, 10వ వార్డు సభ్యులు ఇగురపు వినోద-సంజీవ్ స్వయంగా పనుల్లో పాల్గొన్నారు. స్థానిక యువకుల సహాయంతో బోర్‌ను మరమ్మతు చేసి, ప్రజలకు మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం, ఉప సర్పంచ్ ఇస్తారితో పాటు వార్డు సభ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.