
పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి
పెళ్లికి జాతకాలతో పాటు వైద్య పరీక్షలు కూడా తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల దంపతుల ఆరోగ్యంతో పాటు పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ పరీక్షలు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి.




