మహిళల భద్రతే పోలీస్ శాఖకు తొలి ప్రాధాన్యం: ఎస్పీ నితిక పంత్

2చూసినవారు
మహిళల భద్రతే పోలీస్ శాఖకు తొలి ప్రాధాన్యం: ఎస్పీ నితిక పంత్
కొమురం భీమ్ జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మహిళలు హింస, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో జిల్లాలో 54 హాట్స్పాట్లు గుర్తించి, 19 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో చట్టాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సహాయం కోసం ఆసిఫాబాద్ షీటీం: 8712670564, కాగజ్‌నగర్ షీటీం: 8712670565 లేదా డయల్ 100ను సంప్రదించవచ్చు. సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్