Dec 14, 2025, 05:12 IST/
పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచాం: జగ్గారెడ్డి
Dec 14, 2025, 05:12 IST
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి టౌన్లో శనివారం ఆయన గెలిచిన, ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 45 పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని, గెలిచిన అభ్యర్థులు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్గా గెలిచిన వారు కాంగ్రెస్లో చేరాలనుకుంటే స్థానిక నాయకుల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.