బెల్లంపల్లికి చెందిన ముష్కే వెంకటేష్ (45) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో బుధవారం రాత్రి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వెంకటేష్ బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్‌లో కోర్ట్ కానిస్టేబుల్‌గా పనిచేసి, ప్రస్తుతం మాదారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.