గుడిలో పూజ చేస్తున్న వ్యక్తిపై మద్యం మత్తులో దాడి

2074చూసినవారు
గుడిలో పూజ చేస్తున్న వ్యక్తిపై మద్యం మత్తులో దాడి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని వేమనపల్లి గ్రామంలోని హనుమంతుని గుడిలో పూజలు చేస్తున్న డోకె వెంకటిపై, అదే గ్రామానికి చెందిన ఎల్లెలా శ్రీనివాస్ మద్యం సేవించి దాడి చేశాడు. గుడిలోకి మద్యం సేవించి రావద్దని వెంకటి హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన శ్రీనివాస్ చెక్క బల్లతో వెంకటి తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించారు. నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితుడి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే FIR నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్