వర్షాల కోసం కప్పతల్లి ఆట

2371చూసినవారు
బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్‌లో సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. సరైన వర్షాలు లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, వరుణ దేవుడి కరుణ కోసం గ్రామంలో ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పతల్లిని అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామ దేవతల ఆలయాల్లో పాలు, నీటితో జలాభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్