చెన్నూర్ మండలం సుందరసాలకు చెందిన కారు యజమాని బొమ్మ హరికృష్ణ (28) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు. వ్యవసాయంలో దిగుబడి రాక, తండ్రి మృతితో మనస్థాపానికి గురైన హరికృష్ణ, బీటెక్ పూర్తి చేసి కారు కొని అద్దెకిచ్చాడు. నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగి, పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.