మందమర్రిలో గుడుంబా కలకలం..స్థానికుల ఆందోళన

3447చూసినవారు
మందమర్రిలో గుడుంబా కలకలం..స్థానికుల ఆందోళన
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొర్లబంగ్ల ప్రాంతంలో నాటు సారా మహమ్మారి మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. గుడుంబా సేవించి గురువారం ఒక వ్యక్తి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వరుస మరణాలతో దొర్లబంగ్ల ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, గుడుంబా తయారీని, విక్రయాలను అరికట్టడంలో సంబంధిత ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అ

సంబంధిత పోస్ట్