Dec 15, 2025, 17:12 IST/
రూపాయి ఆల్ టైం కనిష్టానికి పతనం: ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
Dec 15, 2025, 17:12 IST
భారత రూపాయి విలువ ఆందోళనకరంగా పడిపోతోంది. తాజాగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90.75 స్థాయికి చేరుకుని, ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఆలస్యం, పెరుగుతున్న వాణిజ్యలోటు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వంటివి రూపాయి పతనానికి కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల దిగుమతుల వ్యయం పెరిగి, ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్భీఐ జోక్యంపై ఆర్థిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.