వేమనపల్లిలో సోమవారం ఎంపీడీఓ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి వినతులు రాలేదు. పలు శాఖల అధికారులు హాజరైనప్పటికీ, అర్జీదారులు ఎవరూ రాకపోవడంతో కార్యక్రమం నిరాడంబరంగా ముగిసింది. సరైన ప్రచారం లేకపోవడం, ప్రజావాణిని కేవలం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.