ప్రాణం తీసిన గర్భస్రావం.. ప్రియుడు అరెస్ట్

1038చూసినవారు
ప్రాణం తీసిన గర్భస్రావం.. ప్రియుడు అరెస్ట్
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జగదీష్ అనే యువకుడు తనను ప్రేమించిన యువతి గర్భం దాల్చడంతో, ఆమెకు గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించాడు. రక్తహీనత కారణంగా హైదరాబాద్ ఆసుపత్రులు నిరాకరించడంతో, కర్నూలుకు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. తొలుత అనారోగ్యంతో చనిపోయిందని జగదీష్ కట్టుకథ అల్లినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్