శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న బాల్క సుమన్

3560చూసినవారు
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న బాల్క సుమన్
బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగమండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకుని, ఆలయ అధికారుల నుంచి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం స్వీకరించారు. లోకకల్యాణార్థం, తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా మల్లన్న ఆశీస్సులు కోరినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్