మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 1, 2, 23, 54 డివిజన్లలో BLOలు, BLAలు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో
కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. కొత్త ఓటర్లను, మార్పులు అవసరమైన వారిని గుర్తించి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు, ప్రతినిధులకు ఆమె సూచించారు.