దండేపల్లి మండలం రాసపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ (46) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ, అనారోగ్యం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. చేపల వేటకు వెళ్ళిన భర్త ఇంటికి రాగానే, పిల్లలను బాగా చూసుకోమని, తాను ఇక బతకనని చెప్పి పురుగుల మందు తాగినట్లు ఆమె తెలిపింది. వెంటనే భర్త ఆమెను లక్షేటిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.