దండేపల్లి: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

72చూసినవారు
దండేపల్లి: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి మండలంలోని వెలుగనూరుకు చెందిన మెండే మహేష్ (24) కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. మహేష్ రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆర్థిక స్థోమత లేక మెరుగైన చికిత్స పొందలేదు. తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్ ను లక్షేటిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్