దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్

3074చూసినవారు
దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రజల భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వెనుకబడిన తరగతుల కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్