మంచిర్యాల: అనారోగ్య సమస్యలతో ట్రైన్ కింద పడి ఆత్మహత్య

1279చూసినవారు
మంచిర్యాల: అనారోగ్య సమస్యలతో ట్రైన్ కింద పడి ఆత్మహత్య
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో బోనుగురు లింగమూర్తి (40) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లింగమూర్తి, కొంతకాలంగా అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు అతని భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లింగమూర్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్