ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

2518చూసినవారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అండగా నిలిచిన ఎమ్మెల్యే
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, పేదల ఆరోగ్య సంరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. లక్షెట్టిపేట్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన వి. సుభాషిని అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ₹2,50,000/- విలువైన LOC ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యేకు సుభాషిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్