శ్రీరాంపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

3118చూసినవారు
శ్రీరాంపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారు పూర్తిగా నలిగిపోగా, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్