తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సింగరేణి సంస్థను గట్టెక్కించేందుకు తాడిచర్ల కోల్ బ్లాక్-II ను సింగరేణికే కేటాయించాలని కోరుతూ
బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మంచిర్యాల జిల్లాలో కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా, సింగరేణి రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాడిచర్ల బ్లాక్ కేటాయింపుపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర
బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, ఆరు జిల్లాల
బీజేపీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన
బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.