మంచిర్యాల జిల్లా కేంద్రంలోని
బీజేపీ కార్యాలయంలో సింగరేణి ప్రాంత ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి
బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. సింగరేణి బొగ్గు గనుల కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని, సింగరేణి బెల్ట్ పరిధిలోని అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.