మంచిర్యాల జిల్లాలో వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సంయుక్తంగా నిర్వహించిన వంద రోజుల కుట్టు శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం కుట్టు శిక్షణ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మహిళలు స్వయంశక్తితో ఎదిగి, మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని, తమలోని కుట్టు నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.