ముధోల్ నియోజకవర్గ
కాంగ్రెస్ ఇన్చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు. ముధోల్ ప్రజల సమస్యలు, అభివృద్ధి అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, ముధోల్ నియోజకవర్గంలో బుద్ధ విహార్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయడంతో పాటు పలు గ్రామాల్లోని మందిరాల వద్ద సెంట్రల్ లైటింగ్ లు ఏర్పాటు చేస్తామని, ఈ పనులన్నీ ఒక నెలలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.