ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం: విజయ్ కుమార్

2629చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం: విజయ్ కుమార్
కుభీర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన సదుపాయాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని మండల విద్యాధికారి విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన కుభీర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, చోండి, గోడిసారా, పాంగ్ర ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదు పెంచాలని, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని, నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్