జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శనివారం తెలిపారు. జిల్లాలో 3 ల్యాబ్ టెక్నీషియన్, 2 సీనియర్ ట్యుబర్క్యులాసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.