రాత్రి బీఆర్ఎస్.. ఉదయం కాంగ్రెస్

808చూసినవారు
రాత్రి బీఆర్ఎస్.. ఉదయం కాంగ్రెస్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు పార్టీలు మారుతున్నారు. నిర్మల్ పట్టణంలోని 15వ వార్డు (ఎస్టీ జనరల్) నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన రాథోడ్ అంబాజీ, టికెట్ దక్కదని భావించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే, విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు, అంబాజీని 15వ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఉదయం తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్