చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

332చూసినవారు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన 54 ఏళ్ల మత్స్యకారుడు నాగుల రాజశేఖర్, శనివారం కడెం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈదురుగాలుల కారణంగా తెప్పపై నుంచి నీటిలో పడిపోయిన రాజశేఖర్, బయటపడేందుకు ఈత కొడుతున్న సమయంలో కాలుకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్