నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్
ఎన్టీఆర్ మార్గ్ లేన్ 2 రోడ్డు నెంబర్ 1Aలో చిన్నపాటి చినుకు పడితేనే రోడ్డు చెరువుగా మారుతోంది. ఈ రోడ్డులో నివసిస్తున్న దాదాపు 80 కుటుంబాలు, బాలాజీ అపార్ట్మెంట్,
బాహుబలి అపార్ట్మెంట్, ఎస్సీ బాలికల హాస్టల్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలు లేకపోవడంతో రోడ్డుపై నీరు నిలిచి, ఇళ్లలోని త్రాగునీటి బోర్ వెల్స్ కలుషితమవుతున్నాయి. నీటి నిల్వ వల్ల దోమల బెడద కూడా పెరిగిపోతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి, మురికి కాలువల నిర్మాణము మరియు రోడ్లు వేసి, వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.