జూలై 6న గురుకులాల్లో ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి, 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన RJCCET-2026 కౌన్సెలింగ్ రెండు దశలు పూర్తయినా ఇంకా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే జూలై 6న నిర్మల్ జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.