సీపీఆర్‌ చేసి.. ప్రాణాలు కాపాడి..

585చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం పోలీసు పెట్రోల్ బంక్ వద్ద బైక్ పై పెట్రోల్ కోసం వచ్చిన వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ సకాలంలో స్పందించి, సీపీఆర్ చేసి అతనికి ఊపిరి పోశాడు. అనంతరం అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

సంబంధిత పోస్ట్