స్కోచ్ అవార్డు: నిర్మల్ ఎస్పీకి సీఎం అభినందనలు

885చూసినవారు
స్కోచ్ అవార్డు: నిర్మల్ ఎస్పీకి సీఎం అభినందనలు
ఢిల్లీలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానకి షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మహిళల భద్రతపై అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమాల ద్వారా 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన "పోలీస్ అక్క" కార్యక్రమం పోలీసు యంత్రాంగానికి ప్రేరణగా నిలుస్తుందని, మహిళా అధికారులు పోలీస్ అక్కలుగా మారి మహిళలు, బాలికలకు ఆత్మవిశ్వాసం కల్పించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంచే ఈ వినూత్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్