Jan 05, 2026, 02:01 IST/
ప్రాణం మీదకు తెచ్చిన గాలిపటం సరదా
Jan 05, 2026, 02:01 IST
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గణేష్ అనే విద్యార్థి.. ఆధార్ కార్డు అప్డేట్ కోసం బాలాపూర్ చౌరస్తాలోని తన అత్తమ్మ ఇంటికి వచ్చాడు. గాలిపటం ఎగరేస్తూ హైటెన్షన్ వైర్లపై పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో సమీపంలోని కొన్ని ఇళ్లలో గృహోపకరణాలు కూడా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.