
పరీక్షల భయం వీడి, ఆత్మవిశ్వాసంతో రాయాలి: సుందిళ్ల రమేష్
కొమరంభీం జిల్లా, సిర్పూర్(టి) ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. మోటివేషనల్ స్పీకర్ సుందిళ్ల రమేష్ మాట్లాడుతూ, పరీక్షల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువు, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







































