పురుషోత్తమ మాసంలో వైభవంగా లక్ష తులసీ దళాభిషేకం- కుంకుమ పూజలు

2చూసినవారు
పురుషోత్తమ మాసంలో వైభవంగా లక్ష తులసీ దళాభిషేకం- కుంకుమ పూజలు
పురుషోత్తమ మాస ప్రవచనాల సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం లక్ష తులసీ దళాభిషేకం, మహిళా మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండ ముక్తేశ్వర్ లక్ష తులసీ దళాలను సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సూరిపెద్ది రాధాకృష్ణ అయ్య, డాక్టర్ బ్రహ్మశ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ, బ్రహ్మశ్రీ బాచంపల్లి కిషన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కేశెట్టి శంకరయ్య, ప్రచార కార్యదర్శి బి. రాజేంద్రప్రసాద్, సంయుక్త కార్యదర్శి కుంకుముట్టి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :