సిర్పూర్-T మండలంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, కేంద్రం కేవలం ₹600 వేతనాలతో కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు సూచించిన కనీస వేతనం ₹18,000 ఇవ్వాలని, రాష్ట్రం హామీ ఇచ్చిన ₹10,000 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. EPF, ESI సౌకర్యాలు కల్పించడంతో పాటు వంట సరుకులు, గ్యాస్, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.