విద్యార్థుల భవిష్యత్తుకు ‘ఆల్ఫా కరికులం హైపాత్ బుక్'

1చూసినవారు
విద్యార్థుల భవిష్యత్తుకు ‘ఆల్ఫా కరికులం హైపాత్ బుక్'
కాగజ్‌నగర్ పట్టణంలోని విద్యాధరి పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సుతో పాటు నూతన విద్యా విధానం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘ఆల్ఫా కరికులం హైపాత్ బుక్స్’ను ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపెల్లి కిషన్ రావు, ఇతర అతిథులు ప్రారంభించారు. ఈ కరికులం విద్యార్థుల ఆలోచనా శక్తి, ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యా నిపుణులు బుష్రా రషీద్ ఖాన్, ప్రజ్ఞ మిశ్రా పాల్గొని వివరాలు వెల్లడించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్