అంబేద్కర్ జయంతి ర్యాలీ పోస్టర్ల ఆవిష్కరణ

1చూసినవారు
అంబేద్కర్ జయంతి ర్యాలీ పోస్టర్ల ఆవిష్కరణ
ఈ నెల 14న నిర్వహించనున్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి మహా ర్యాలీకి సంబంధించిన గోడ పోస్టర్లను సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని తెలిపారు. సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జయంతి వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, 14న జరిగే ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్