కాగజనగర్ మండలం బోడేపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో బుధవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ నరసయ్య, మాజీ ఎంఫిటిసి శ్యామ్ రావు, మండల విద్యాశాఖాధికారి వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాధవి, ఉపాధ్యాయులు శృతి, సాయి శేఖర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు.