ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ

0చూసినవారు
ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ
కొమురంభీం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీపీఎం నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్ కుమార్ విమర్శించారు. జిల్లాలో తాగునీరు, వైద్యం, ఉపాధి, సాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్