ఫ్లైఓవర్ కింద భగీరథ లీకేజీ.. కలుషిత నీటితో కాలనీవాసుల అవస్థలు

0చూసినవారు
కాగజ్‌నగర్ పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీకేజీ వల్ల కలుషిత నీరు తాగునీటితో కలుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే లీకేజీని మరమ్మతు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్