కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్ సమీపంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. ఈరోజు రాత్రి 12 గంటల వరకు భజన కార్యక్రమం నిర్వహించబడునని 12 గంటల తర్వాత శివునిపై ప్రతి ఒక్కరిచే పత్రి సమర్పించబడునని ఆలయ ప్రచార కార్యదర్శి బి. రాజేంద్రప్రసాద్, కమిటీ సభ్యులు తెలిపారు.