భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం: మహార్ అమర సైనికులకు నివాళులు

7చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో బౌద్ధ సమాజ్ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం సందర్భంగా అమరలైన మహార్ సైనికులకు నివాళులు అర్పించారు. బౌద్ధ మహాసభ తాలూకా అధ్యక్షులు బి. విశ్వనాథ్ మాట్లాడుతూ, 1818 జనవరి 1న 500 మంది మహార్ లు 28వేల పిశ్వా సైనికులను ఎదిరించి, శతాబ్దాలుగా అవమానానికి గురైన వర్గం ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని, అది సమానత్వానికి, ఆత్మగౌరవానికి గెలుపని, అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏమాజీ, జానకిరామ్, గోవింద్ రావ్, వెంకటేష్, విట్టల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్