బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. పులి అడుగుల జాడలు, చలనం కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులకు డప్పు చాటింపు ద్వారా హెచ్చరికలు జారీ చేసి, అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయటకు రావడం తగ్గించాలని, పశువులను అడవి అంచుల వద్ద మేపవద్దని సూచించారు.