డా. ‌ఆర్ఎస్పి భద్రత పెంచాలని కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ ధర్నా

1147చూసినవారు
డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, మరింత పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాగజ్‌నగర్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుడి భద్రతను తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్